హైదరాబాద్ లో అమానుషం.. కులాంతర వివాహం చేసుకున్నారని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కులాలు, మతాలు అనే తేడా లేకుండా నివసిస్తోన్న హైదరాబాద్ నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దళిత మహిళను కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆలయ బహిష్కరణ చేశారు దేవాలయ నిర్వాహకులు. ఘటన హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నక్క యాదగిరి గౌడ్ గత 14 ఏళ్లుగా పని చేస్తున్నాడు. అయితే, యాదగిరిగౌడ్ రెండు నెలల క్రితం ప్రేమలత అనే దళిత మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమలత మాదిగ కులస్థురాలు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, యాదగిరిగౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ విషయం మాట్లాడేందుకు ప్రేమలత లక్ష్యయ్య ఇంటికి వెళ్లింది.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
దీంతో కోపోద్రోక్తుడైన చైర్మన్ లక్షయ్య ప్రేమలతను కులం పేరుతో దూషిస్తూ.. ‘నీవు మాదిగ కులానికి చెందిన దానివి అని తెలిస్తే గుడిలోకి అడుగు పెట్టనిచ్చే వాళ్లం కాదు’ అని అసభ్యకరంగా దూషిస్తూ గేటు బయటికి గెంటేశాడు. అంతేగాకుండా ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, మేనేజర్ శ్రీహరి, చిరంజీవిలు వాళ్ల అనుచరులతో కలిసి యాదగిరి, ప్రేమలతలు నివసిస్తున్న ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు విసిరి పారేశారు.
దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముందు పోలీసులు సైతం వారినుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లుగా తెలిసింది. చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు విషయాన్ని బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచి నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..