బ్రేకింగ్ : టీటీడీలో ఉదయాస్తమాన సేవ.. ధర రూ.కోటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్‌పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600 కోట్ల ఆదాయం సమాకూరనుండగా.. ఈ ఆదాయం మొత్తంతో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనుంది. ఈ క్రమంలో టీటీడీ ఈనెల 23న ఉదయాస్తమాన సేవా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఉదయాస్తమాన టికెట్‌తో స్వామివారికి ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ నుంచి తోమాల సేవ, కొలువు, అష్ట దళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రాలంకార సేవ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహాస్ర దీపాలకరణ సేవతో పాటు ఏకాంత సేవలో పాల్గొనవచ్చు.
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!