Site icon NTV Telugu

ఉద‌యాస్త‌మాన టికెట్ల‌పై టీటీడీ క్లారిటీ…

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద‌యాస్త‌మాన సేవా టిక్కెట్ల‌పై క్లారిటీ ఇచ్చింది.  ఈ సేవ‌ను 1982లోనే ప్రారంభించిన‌ట్టు అద‌న‌పు ఈఓ ధ‌ర్మారెడ్డి పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న 531 సేవా టికెట్ల‌ను మాత్ర‌మే భ‌క్తుల‌కు కేటాయిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  చిన్న పిల్ల‌ల కార్డిక్ ఆసుప‌త్రి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.  

Read: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత..

చిన్న పిల్ల‌ల హాస్ప‌ట‌ల్‌కు కోటి రూపాయ‌ల విరాళంగా అందించిన భ‌క్తుల‌కు ప్ర‌విలేజ్‌గా ఉద‌యాస్త‌మాన సేవా టిక్కెట్లు కేటాయిస్తామ‌ని అన్నారు.  ఆన్‌లైన్ విధానంలో టిక్కెట్ల‌ను పార‌ద‌ర్శ‌కంగా భ‌క్తుల‌కు కేటాయిస్తున్న‌ట్టు టీటీడీ తెలియ‌జేసింది. ఇక ఇదిలా ఉంటే, రేపు టీటీడీ ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల‌ను రిలీజ్ చేయ‌నుంది.  రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ టిక్కెట్ల‌ను జారీ చేయ‌నున్నారు.  

Exit mobile version