Site icon NTV Telugu

ప్రజలకు కేసీఆర్‌కు మధ్య బాగుంది.. మన మధ్యే గందరగోళం..!

పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య బాగుంది.. కానీ, మన మధ్యనే గందరగోళం ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి వరుసగా పార్టీ సమావేశాలు పెట్టుకుందాం.. ఎప్పటికప్పుడు సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా పనిచేద్దాం అని సూచించారు కేటీఆర్.

Exit mobile version