Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trs Party Vijaya Garjana Meeting Postponed

టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా.. కారణం అదేనా..?

Published Date :November 1, 2021 , 8:53 pm
By Sudhakar Ravula
టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా.. కారణం అదేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్‌ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్‌లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Read Also: అయోధ్య, వేలాంక‌ని, అజ్మీర్‌కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!

Also Read

  • Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
  • Delhi: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య.. లైంగిక దాడి అనంతరం మొబైల్ ఛార్జర్‌తో గొంతు నులిమి
  • Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
  • Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కాగా, నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ సచ్చుడో ’ అనే నినాదంతో కేసీఆర్‌ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకొని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు కేసీఆర్.. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను నవంబర్ 29వ తేదీకి మార్చుకోవాలని తెలిపారు.. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు టీఆర్ఎస్‌ అధినేత.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • telangana
  • TRS party
  • TRS Vijaya Garjana
  • TRS Vijaya Garjana Meeting

తాజావార్తలు

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

  • Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions