ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ప్రభుత్వం అలాగే… టీఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే…. ఇందులో భాగంగానే.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నిన్న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. అయితే.. నిన్నటి ధర్నాలో టీఆర్‌ఎస్ కీలక నేతలు నోటికొచ్చింది మాట్లాడారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీని టార్గెట్ చేయగా…. రసమయి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అయితే… ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీ ఏకంగా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశాడు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ లో జరిగిన ధర్నాలో టిఆర్ఎస్ జెడ్పిటిసి నాగం భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంటే… తెలంగాణ న్యూ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దేశం లో తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా కేసీఆర్ ఆదుకుంటారని భూమయ్య స్పష్టం చేశారు. అయితే భూమయ్య చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.