Site icon NTV Telugu

పార్లమెంట్‌ ఉభయసభల నుంచి టీఆర్ఎస్‌ వాకౌట్..

రైతు సమస్యలపై పార్లమెంట్‌ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్‌ చేశారు టీఆర్ఎస్‌ ఎంపీలు.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్‌ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి.. రైతులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.. “సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం” తీసుకురావాలని నినదించారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసిన ఎంపీలు.. రబి ధాన్యం సేకరణను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.. పార్లమెంట్‌లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. చివరకు పార్లమెంట్‌ ఉభయసభల నుంచి వాకౌట్‌ చేస్తున్నామంటూ ప్రకటించారు టీఆర్ఎస్‌ ఎంపీలు.

Read Also: బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్‌లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!

Exit mobile version