పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు..
Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై చట్టం..!
ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు టీఆర్ఎస్ ఎంపీలు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. రాష్ట్రానికి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్‌తో చర్చించడం.. ఒకటి …రెండు రోజుల్లో కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధమే జరుగుతోంది.. కేంద్ర విధానాన్ని రాష్ట్రం తప్పుబడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే స్పందించడంలేదంటూ కేంద్రం విమర్శలు గుప్పిస్తోంది.
