NTV Telugu Site icon

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌ కు సైబర్‌ టవర్స్‌ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్‌, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా కొండాపూర్‌, ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

దీనితో పాటు హఫీజ్‌పేట, మియాపూర్‌, కొత్తగూడ నుంచి సైబర్‌ టవర్స్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లే వారు రోలింగ్‌ హిల్స్, ఐకియా, ఇనార్బిట్‌ మాల్‌ నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌ మొత్తం టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు, హోర్డింగ్‌లతో గులాబిమయంగా మారింది.