NTV Telugu Site icon

రేవంత్‌ సంచలనం.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..

Revanth Reddy

Revanth Reddy

ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పొరు చేసిన గడ్డ ఇది అని గుర్తుచేశారు రేవంత్‌… అటువంటి వారిని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన ఆదివాసీ బిడ్డల పేర్లను స్మారక శిలాఫలకంపై లిఖిస్తామన్నారు. నాడు ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే భాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

అయితే, పోరాటాల చరిత్ర ఉన్న ఆదిలాబాద్‌ టీఆర్ఎస్‌ మార్చేసిందని.. ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న, గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ ఈ జిల్లాకు పట్టిన చీడ అంటూ మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.. ఇక, ఆదివాసీ, దళితుల కోసం సభ పెడితే పోలీసులు అడ్డుకోవడం తగునా.. అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు.. ఈ సభలో లక్షకు ఒక్క తల తక్కువగా ఉంటే నా తల వంచుతా.. ఇప్పుడు తల ఎత్తి.. కేసీఆర్‌ దల దించుతా అంటూ వ్యాఖ్యానించారు.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ హెచ్చరించిన రేవంత్.. సీఎం కేసీఆర్ ను బొంద పెడుతా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేవారు.. 20 నెలల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైలే గతి అని కామెంట్ చేసిన ఆయన.. అసలుకు మిత్తితో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. సన్నాసి బాల్క సుమన్… కాంగ్రెస్ ఏమి చేసిందని అడుగుతున్నాడు… నువ్వు రిజర్వేషన్ సీటులో ఎమ్మెల్యే, ఎంపీ కావడానికి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్‌ అన్నారు.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలి.. అప్పుడే దళిత బంధు లాంటి పథకాలు వస్తాయన్న ఆయన.. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు.. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద అప్పు మోపాడు.. కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు… కొడుకును టాటాను చేసాడు… బిడ్డను బిర్లాను చేసాడు అంటూ కామెంట్లు చేశారు.

ఇంకో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు రేవంత్‌రెడ్డి.. మీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణకు తల్లి అంటే సోనియమ్మ అన్నారు.. ఏడేళ్లలో ఏమివ్వలేదు. వాళ్ళు ఇంట్లో ఆస్తులోచ్చాయి.. రావుల రాజ్యంలో దళిత గిరిజనులకు ఏమి రావు అన్నారు.. ఈ సందర్భంగగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.