ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…