NTV Telugu Site icon

మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరయ్యేది వీళ్ళే!

2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు.

ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల వెంట్రుకలను 2017 సంవత్సరంలోనే తీసుకోని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపించారు. ఆతరువాత ఈ కేసు విచారణలో వేగం తగ్గింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఫిటిషన్ దాఖలు అయింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ కూడా అటు సీబీఐ అధికారులకు ఈడీ అధికారులకు ఒక లేఖను రాశారు. దీంతో మరోసారి విచారణకు హాజరుకానున్నారు.

మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు LIVE | Tollywood Drugs Case | NTV Live