పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఐప్యాక్ సంస్థ మరో ఐదేళ్ల పాటు తృణమూల్ తో ఒప్పందం చేసుకున్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతలకు రాజకీయంగా సలహాలను ఈ సంస్థ అందిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యున్నతికి తన పాత్ర చాలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా వార్తలు రావడంతో తృణమూల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read: అలర్ట్: జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్….
ఐప్యాక్ ఏజెన్సీతో మాత్రమే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ సంస్థకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తిచేస్తే చాలని, ఐప్యాక్ సంస్థకు తమకు ఎలాంటి విభేదాలు లేవని తృణమూల్ స్పష్టం చేసింది. పార్టీ అభ్యున్నది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న తుది నిర్ణయాన్ని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చూసుకుంటారని నేతలు చెబుతున్నారు. ఐదేళ్లపాటు తృణమూల్‌తో ఐప్యాక్ ఒప్పందం చేసుకున్నది. మరి దీనిపై ప్రశాంత్ కిషోర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
