NTV Telugu Site icon

Smart Phone: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీ ఫోన్ లైఫ్ పెంచుకోండి

smartphone

smartphone

స్మార్ట్​ ఫోన్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్​లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరి జీవితంలో ఫోన్ భాగమైపోయింది. నేటితరం యువతకు అయితే పొద్దున్న లేచింది మొదలు..రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్​ఉండాల్సిందే. ఇంటా బయట ఎక్కడ ఉన్నాసరే చేతిలో ఫోన్ లేనిది రోజు గడవదు. ఫోన్ కొనుగోలు చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెడతారు. అయితే, ప్రాణంగా చూసుకునే స్మార్ట్ ఫోన్ చార్జింగ్, బ్యాటరి ఇతర సమస్యలు వేధిస్తుంటాయి. అయితే చిన్న​టిప్స్​పాటిస్తే మీ స్మార్ట్​ ఫోన్​ లైఫ్​ టైమ్​ను పెంచుకోవచ్చు.
Also Read:MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు షురూ

ఖరీదైన స్మార్ట్​ ఫోన్ టచ్​స్క్రీన్​లు చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి ఏ చిన్న వస్తువు తగిలినా సరే గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి డబుల్​ లేయర్​లు కలిగి ఉన్న గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టర్​లను ఎంచుకోవాలి. దీంతో మొబైల్ కిందపడినా సరే.. డిస్​ప్లేకు ఏం కాదు. ఫోన్ కిందపడినప్పుడు స్క్రీన్​తో పాటుగా ఫోన్​ వెనుక భాగం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి బ్యాక్ పౌచ్ లను పెట్టుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ జీవితం నడుస్తున్న బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల సంఖ్య, ఫోన్ వినియోగం, మరిన్ని వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి అనేక యాప్‌లను రన్ చేయడం వల్ల మీ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. ఛార్జింగ్ పాయింట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. బిజీ లైఫ్ లో ఛార్జింగ్ పెట్టే అవకాశమే ఉండదు. రోజంతా ఫోన్ చేతిలో ఉన్నందున.. ఛార్జింగ్ పెట్టే టైమ్ ఉండదు. కాబట్టి వీలున్నంత వరకు రాత్రి లేదా ఖాళీ సమయాల్లో ఛార్జింగ్ పెడితే బ్యాటరీని ఫుల్ అవుతుంది. సైబర్ మోసాల బారిన పడకుండా ఫోన్​లో యాంటీవైరస్ సాఫ్ట్​వేర్​లు కూడా ఉండాలి. ఫోన్​లో యాప్స్ లోడ్​ఎక్కువ ఉంటే బ్యాటరిపై ప్రభావం చూపిస్తుంది. వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఫోన్​లో మనకు అవసరం లేని ఫైల్స్​తో పాటుగా ఫొటోలు, వీడియోలు, యాప్స్​లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. పవర్ వినియోగించే బ్యాక్‌గ్రౌండ్ సర్వీస్‌లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పవర్ సేవింగ్ మోడ్‌లతో వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ సేవలను ఆఫ్ చేయడం, స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని పొడిగించవచ్చు.

Also Read:Oscars 95: చివరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’…

ఇక, ఓఎస్​ అనేది కొత్త మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది. అయితే, కొత్తగా వస్తున్న ఓఎస్​లకు కొన్ని హార్డ్​వేర్​లు సపోర్ట్ చేయవు. ఫోన్​పనితీరు మెరుగుపడుతుందని అప్​డేట్​ చేయకపోవడమే మంచిది. ఫోన్​తో అవసరం లేదనుకున్న కాస్త సమయమైనా దాన్ని స్విచ్ఛాఫ్​చేయడం మంచిది. స్నానం, భోజనం, వ్యాయామం లాంటివి చేస్తున్నప్పుడు మొబైల్​ను ఆఫ్​చేయడం ద్వారా ఫోన్​ లైఫ్​ టైమ్​ను పెంచుకోవచ్చు. ఫోన్​కు స్ట్రాంగ్ పాస్​వర్డ్​లతో పాటుగా ఫింగర్​ప్రింట్​ లాక్​ కూడా పెట్టుకోవడం మంచిది. డార్క్ మోడ్ లేదా బ్లాక్ థీమ్ నలుపు రంగును ప్రదర్శించే పిక్సెల్‌లను ఆఫ్ చేయడం ద్వారా OLED స్క్రీన్‌లపై బ్యాటరీ జీవితాన్ని ఆదా చేస్తుంది. మీ Android స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితాన్ని మెరుగుపర్చడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు.