బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇక తాజాగా మరో టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..
తాజాగా టైగర్ కా మెసేజ్ అనే పేరుతో మరో టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ అని, కాని అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో సల్మాన్ తన కొడుకు కోసం, తన నిజాయితీ కోసం, తన దేశం కోసం ఎలా పోరాటం చేసాడన్నది సినిమా కథగా ఉండనున్నట్టు చూపించారు.. టీజర్ లోనే సల్మాన్ ఫుల్ యాక్షన్ ను చూపించారు..వార్, పఠాన్ సినిమాలకు మించి యాక్షన్ సీన్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది…
ఈ సినిమాను మొదట దసరాకు విడుదల చేద్దామనుకున్న ఆ డేట్ కుదరలేదు.. దాంతో సినిమాను దీపావళికి విడుదల చెయ్యనున్నట్లు చిత్రాయూనిట్ అనౌన్స్ చేశారు..ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ రెండు 1000 కోట్ల సినిమాలు సాధించడంతో ఈ సినిమా కూడా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దిగుతుంది. ఇక YRF స్పై యూనివర్స్ లోని షారుఖ్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్ 3 సినిమాలో కూడా షారుఖ్ గెస్ట్ అప్పిరెస్ ఇవ్వనున్నాడని బాలివుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా కోసం సల్లూ భాయ్ అభిమానులతో పాటుగా బాలివుడ్ ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది..