Site icon NTV Telugu

నవంబర్ 1 నుంచి ఏం మారనున్నాయి?

నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్‌ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పించిన వీడియో కాల్‌ సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.

మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి , విత్‌డ్రా చేయడానికి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టబోతోంది. వాస్తవానికి, నిర్ణీత పరిమితి పరిమితి కంటే ఎక్కువ బ్యాంకింగ్ సేవను ఉపయోగించినందుకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు రుణ ఖాతాకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ విధిస్తారు. మీ జన్ ధన్ ఈ బ్యాంకులో ఉంటే, డబ్బు డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ ఉపసంహరణపై రూ.100 చెల్లించాలి.

Also Read: స్టాక్‌ మార్కెట్లో ఐపీఓల సందడి

అటు భారతీయ రైల్వేలు దేశంలోని రైళ్ల టైమ్ టేబుల్‌ని మార్చబోతున్నాయి. కొత్త టైమ్ టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇప్పుడు 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల వేళలు మారబోతున్నాయి. నవంబర్ మొదటి తేదీ నుంచి దాదాపు 30 రాజధాని రైళ్ల వేళలు కూడా మారనున్నాయి. అంతేకాకుండా రేపటి నుంచి ఆండ్రాయిడ్, ఐవోఎస్ పాత వెర్షన్‌లలో వాట్సాప్ యాప్ పనిచేయదు. ఇవే కాకుండా పాలసీబజార్ సంస్థ కూడా సోమవారమే ఐపీవోకు రానుంది. దీంతోపాటు నవంబర్‌లో పలు సంస్థలు ఐపీవోకు రానున్నాయి.

Exit mobile version