NTV Telugu Site icon

IND vs SA: ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఉందా?

Ind Vs Sa

Ind Vs Sa

రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?.

Minister Nadendla Manohar: జాయింట్ కలెక్టర్పై మంత్రి నాదెండ్ల సీరియస్

Accuweather నివేదిక ప్రకారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. బార్బడోస్‌లో తెల్లవారుజామున 3 గంటల నుండి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉదయం 11 గంటలకు తుపానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టాస్‌ వేసినా మ్యాచ్‌ని మధ్యలోనే ఆపేయడం ఖాయం. మరోవైపు.. 12 నుంచి 3 గంటల వరకు వర్షం కురిసే అవకాశం 40 శాతం లోపే ఉందని, అలాంటి పరిస్థితుల్లో సకాలంలో గ్రౌండ్ గా పూర్తిగి ఆరిపోతే మ్యాచ్‌ని పూర్తి చేయవచ్చన్నారు.

Kalki 2898AD : కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

టీ20 ప్రపంచ కప్‌లో ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఐసీసీ (ICC) రిజర్వ్ డేని ఉంచింది. జూన్ 29న మ్యాచ్ పూర్తి కాకపోతే.. జూన్ 30న ట్రోఫీ కోసం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే.. రిజర్వ్ రోజున కూడా వర్షం పడే సూచన ఉందా?. ఒకవేళ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రద్దు అయితే టైటిల్ ఎవరు గెలుస్తారు.? రిజర్వ్ రోజున కూడా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ పూర్తి కాకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా నిలిచాయి.