మహారాష్ట్ర.. థానే.. బద్లాపూర్‌లోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. “ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆగస్టు 16న బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైందని విచారించగా.. ఆ బాలికలు బాధను కుటుంబీకులకు తెలిపారు. అది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు 12 గంటల తర్వాత 9 గంటల ప్రాంతంలో కేసు నమోదు చేశారు. తమ కూతుళ్లకు వైద్యపరీక్షలు చేయించడంతో నిజం బయటకు వచ్చింది.
READ MORE: Manu Bhaker video: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్
పాఠశాలకు చెందిన తాత తన బట్టలు విప్పి తన ప్రైవేట్ భాగాలను తాకినట్లు బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితులు బాలికపై అత్యాచారం కూడా చేశారు. పోలీసులు నిందితుడిని పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు. మంగళవారం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీని తర్వాత, ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఆ ప్రాంతంలోని మహిళా ఇన్‌స్పెక్టర్ శుభదా షిటోలేను బదిలీ చేసింది. అంతే కాదు స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
READ MORE:CM Chandrababu: ప్రభుత్వ విజన్‌పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ..
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ లో ఇలా రాశారు.. “బాద్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్తీ సింగ్‌ను విచారణకు నియమించింది. అని పేర్కొన్నారు.
READ MORE:Oldest woman in the world: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ.. ఆమె జీవిత రహస్యాలు ఇవే..
ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ థానే పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందు బద్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసుల నిర్లక్ష్యంపై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు.
