Site icon NTV Telugu

రియా చక్రవర్తి వస్తువులు తిరిగిచ్చేయండి : స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ కోర్టు

rhea-chakraborty 1

సుశాంత్‌ రాజ్‌పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు.

జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున్న రియా చక్రవర్తి విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను, బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలని స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఆమెకు సంబంధించిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర గాడ్జెట్‌లను తిరిగి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Exit mobile version