Site icon NTV Telugu

టీజీఓ, టీఎన్జీవో లు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి : బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బృందం గవర్నర్‌ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్‌ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు.

సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఎంత మంది ఉసురు పోసుకుంటే సీఎం కి కనికరం కలుగుతుందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఉద్యోగులు ఆవేదన చెందకండి… అనారోగ్యం కి గురికాకండి. సకల జనుల సమ్మె మరో సారి చేయాల్సి వస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉంటుంది. టీజీఓ, టీఎన్జీవో లు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి అని బండి సంజయ్‌ అన్నారు.

Exit mobile version