Site icon NTV Telugu

ఏపీ జగన్‌ బర్త్‌డే.. నగరిలో టెన్షన్ టెన్షన్..

వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్‌ టెన్షన్‌గా మారింది. నేడు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా రోజా, రోజా వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్‌ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిద్దమయ్యారు. నగరిలో రోజా పదివేలమందితో భారీ ర్యాలీ సిద్దం కాగా, రోజా వ్యతిరేక వర్గం పదివేలమందితో ర్యాలీ చేస్తామని ప్రకటన చేసింది.

అయితే ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు. నిన్న ఫ్లెక్స్ చింపివేయడంతో రెండు వర్గాల్లో పరిస్థితి నిగురుకప్పిన నిప్పులా మారింది. ఇరు వర్గాలు జగన్‌ పుట్టిన రోజు వేడుకలు పోటాపోటీగా నిర్వహించనున్నట్లు తెలియడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భద్రతను పెంచి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Exit mobile version