భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు సుందర్ తో పాటు కుటుంబం నిరసనలు వ్యక్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని న్యాయం కోసం ప్రధానిని కలిసేందుకు సుందర్ కుమారుడు సంజయ్ ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు.
గతంలో ఎడ్లబండి మీద ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లడంతో పాటు సింగరేణి సంస్థ తీరును నిరసిస్తూ సుందర్ కుటుంబం 5 సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందరికీ విన్నవించినా తమకు న్యాయం జరగడం లేదని ఇటీవల ఇల్లందులో సెల్ టవర్ సైతం సుందర్ ఎక్కాడు. 10 గంటల పాటు సెల్ టవర్ మీద ఉన్న సుందర్ ని కుటుంబ సభ్యులు అధికారులు నచ్చ చెప్పారు. ఆర్డీఓ, సింగరేణి, పోలీస్, రెవెన్యూ అధికారులు అతని సమస్య పరిశీలిస్తామని వివరాలతో రావాలని నచ్చచెప్పి సెల్ టవర్ దింపారు. దాదాపు 1,430 రోజులు నుండి తాము న్యాయ పోరాటం చేస్తు న్యాయం జరగడం లేదని సుందర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు సుందర్ హైదరాబాద్ సైతం వెళ్లాడు. హైదరాబాదులో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తిప్పి పంపారు. తన తండ్రి సెల్ టవర్ ఎక్కి నప్పుడు తల్లడిల్లిన సుందర్ కుమారుడు సంజయ్ తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించి గత నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరాడు. ప్రధానమంత్రి ని కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరతానని.. న్యాయం చేయకపోయినా పర్వాలేదు…. చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు.. సింగరేణి సంస్థతో ఒక కుటుంబం కి జరుగుతున్న సమస్య జిల్లా రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి కి వెళ్ళింది. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నష్టపరిహారం ఇతర ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇస్తానని అధికారులు మభ్యపెట్టి ఇప్పుడు న్యాయం చేయడం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
