NTV Telugu Site icon

కార్యకర్తలకు రేవంత్‌ వార్నింగ్‌.. అలా చేస్తే పార్టీలో ఉండరు..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. ఫస్ట్‌ రోజే ఆయన అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చారు.. గాంధీ భవన్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. సీఎం రేవంత్ అని నినాదాలు చేశారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆ నినాదాలపై సీరియస్‌ అయ్యారు రేవంత్.. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అంటే పార్టీలో ఉండరు.. పార్టీ నుండి బయటకు పంపుతాం.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం అని స్పష్టం చేశారు.. నన్ను అభిమానించే వాళ్ళు అయితే వ్యక్తిగత స్లోగన్ వద్దు అని సూచించిన ఆయన.. తెలంగాణ తల్లి… సోనియా గాంధీనే.. 60 ఏళ్ల కల సాకారం అయ్యింది అంటే సోనియా వల్లేనని.. ఇప్పటినుండి జై కాంగ్రెస్… జై సోనియా గాంధీ నినాదాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.. నా పై అభిమానంతో సీఎం అంటున్నారు కానీ… అది పార్టీకి నష్టమని.. ఇప్పటి నుండి ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దు అన్నారు రేవంత్‌ రెడ్డి.