Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Uma Maheswari Death
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Telangana New Scheme In Telangana State To Be Launch

Telangana: ‘కార్మికబంధు’?.. తెలంగాణలో కొత్త పథకం.. నిర్మాణరంగ కార్మికులకు లక్ష బైకులు..!!

Published Date :July 25, 2022
By K Rao
Telangana: ‘కార్మికబంధు’?.. తెలంగాణలో కొత్త పథకం.. నిర్మాణరంగ కార్మికులకు లక్ష బైకులు..!!

Telangana: ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ పథకానికి ఇంకా పేరు పెట్టలేదు. బహుశా “కార్మికబంధు” అనే పేరు పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ రంగ కార్మికులకు లక్ష బైక్‌లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటన చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు లక్ష బైకులను పంపిణీ చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపులు కూడా చేసినట్లు వెల్లడించారు.

కొత్త పథకం మొదటి దశలోనే వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. సిద్ధిపేటలో మూడు నెలల్లోపు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు 5 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. న్యాక్‌ సెంటర్‌లో లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) సంస్థ ఏటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇస్తుందని చెప్పారు. నిర్మాణరంగ కార్మికులకు ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ను మూడు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షలకు పెంచిన విషయాన్ని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.

CM KCR Delhi Tour: మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..! సీనియర్‌ నేతలతో భేటీ అయ్యే అవకాశం..?

కొత్త పథకంలో భాగంగా ద్విచక్ర వాహనాలను ఎవరికి పంపిణీ చేయనున్నారనే స్పష్టత ప్రస్తుతానికి లేదు. నిర్మాణ రంగ కార్మికులకని చెప్పారు గానీ పూర్తి విధివిధానాలను ఇంకా వెల్లడించలేదు. పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. అర్హులను ఎలా నిర్ణయిస్తారు? ఆదాయ పరిమితిని ఎంత వరకు విధిస్తారో తెలియదు. చదువుకున్న యువత కోసం ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలను జారీ చేస్తున్న కేసీఆర్‌ సర్కారు ఈ పథకాన్ని చదువుకోని యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్దేశిస్తుందేమో చూడాలి.

రైతుబంధు, దళితబంధు పథకాలతో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికబంధు(?)లో ఆయా లబ్ధిదారులను మినహాయిస్తుందా లేక వాళ్లకు కూడా వర్తింపజేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్‌ ఉన్నప్పుడు విద్యార్థులకు ఆదరణ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేశారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల వాటి ద్వారా ప్రయోజనం పొందారు. అప్పటికీ ఇప్పటికీ ప్రజల జీవన స్థాయిలు పెరిగాయి కాబట్టి మళ్లీ సైకిళ్లు ఇస్తే బాగోదని, బైక్‌లు ఇచ్చేందుకు నిర్ణయించారని అనుకోవచ్చు.

  • Tags
  • Finance Minister
  • harish rao
  • karmikabandhu
  • new scheme
  • Siddipet

WEB STORIES

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

"భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్"

‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

"‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా.."

RELATED ARTICLES

Harish Rao: డాక్టర్లకు దండం పెట్టిన మంత్రి.. దయచేసి పని చేయండి..

Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?

Minister Harish Rao: అందరూ నన్ను తిడతారు.. ఎందుకో తెలుసా!

Harish Rao: తెలంగాణ 2వ స్థానంలో.. గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో..

Telangana: వరదలు, వర్షాలతో భారీ నష్టం.. రూ.1400 కోట్లని ప్రాథమిక అంచనా

తాజావార్తలు

  • Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి

  • Corona Updates : తెలంగాణలో మళ్లీ వెయ్యిదాటిన కరోనా కేసులు

  • Divya Bharathi: ‘బ్యాచిలర్’ భామ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుందిగా

  • Rakul Preet Singh: క్లివేజ్ చూపిస్తూ రెచ్చగొడుతున్న ఎర్ర గులాబీ సోయగం

  • Lumpy skin Disease: రాజస్థాన్ లో ప్రబలుతున్న లంపీ స్కిన్ వ్యాధి..90 వేలకు పైగా పశువులకు సోకిన వ్యాధి

ట్రెండింగ్‌

  • WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్‌..

  • OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

  • Google Maps Street View : గూగుల్‌ మ్యాప్స్‌లో మళ్లీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌..

  • Highest Salary in India: అమ్మో.. ఆయన శాలరీ ఏడాదికి రూ.123 కోట్లా?

  • Medical Insurance : ఏవండోయ్‌.. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions