ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు.. ఇవి చేస్తే చాలు-మంత్రి హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడం ప్రజలు చేతుల్లో ఉందని తెలిపిన మంత్రి.. వ్యాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
Read Also: పీఆర్సీపై గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇక, ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవాడనికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు.. అంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.. రాష్ట్రంలో 2 కోట్ల 51 లక్షల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారని.. రెండు డోసులు వేసుకోండి.. ప్రాణాపాయం ఉండదన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల వాక్సిన్ స్టాక్ ఉందని తెలిపిన ఆయన.. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల సమయంలో ఎలా ఓటు కోసం వెళ్లారో… ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు ప్రకటించారన్న ఆయన.. విదేశాల నుంచి దేశంలోకి వచ్చేవారికి ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఆమె శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాము, రిపోర్ట్ రావడం కోసం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందన్నారు మంత్రి హరీష్‌రావు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!