కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ మరోలేఖ.. సాగర్‌లో ఆ తేడా ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ కుడి కాలువ (ఏపీ వైపు), ఎడమ కాలువ(తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని కోరింది.
నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ నీటి మట్టం +500 అడుగుల వద్ద 11,000 క్యూసెక్కులు ఉంటే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ లో నీటి మట్టం +520 అడుగుల ఉంటేనే 11,000 క్యూసెక్కులు వీలవుతుందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది.. MDDL 510 అడుగుల వద్ద ఎడమ కాలువ విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు ఉండగా కుడి కాలువ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులు ఉందని.. ఇది రెండు కాలువల్లో ఉన్న తీవ్రమైన అసమానతగా పేర్కొంది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఉన్న ఈ అసమానతను సరిదిద్దాలని.. రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలని కోరింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!