హస్తినలో శంకుస్థాపన.. రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ… హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది. సాధారణంగా పార్లమెంట్ ఉభయసభల్లో.. కనీసం ఏడుగురు ఎంపీలు ఉన్న పార్టీలకు.. కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో 1300 గజాల స్థలాన్ని కేటాయించింది గృహనిర్మాణ శాఖ. మరోవైపు గత రాత్రి సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ నామా విందు ఏర్పాటు చేశారు.
ఇక, సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది గులాబీ పార్టీ. ఈనెలలో మొత్తం పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇవాళ జెండా పండుగను వాడ వాడలా నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. నేటి నుంచి 12 వరకు గ్రామ పంచాయతీ, వార్డు కమిటీల ఏర్పాటు జరగనుంది. తర్వాత 20 వరకు మండల, పట్టణ కమిటీలు… అనంతరం జిల్లా కార్యవర్గాలు, అధ్యక్షుల ఎంపిక సాగనుంది. చివర్లో రాష్ట్ర కార్యవర్గాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. మొత్తంగా ఈ నెలలో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది టిఆర్ఎస్. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు కమిటీలతో పాటు నగరంలో ఉన్న స్లమ్స్ కు బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే పార్టీ కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఉంటేనే ఆ కమిటీలు చెల్లుబాటు అవుతాయని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఇవాళ గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!