ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ… హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని…