మీరంతా (ప్రజలు) నా వెంట ఉన్నంత కాలం నా లైన్ ఎవరు మార్చలేరు… ఎవరు ఏమి మాట్లాడినా నన్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ భవన్‌లో టి.టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాత్ర ఏంటో అందరికీ తెలుసు అన్నారు.. తెలంగాణ వచ్చాక ఏమి జరిగిందో జనం కళ్ల ముందు ఉందన్న ఆయన.. తప్పు చేసే అధికారం మాకు లేదు.. తప్పు చేస్తే కొన్ని జనరేషన్లు దెబ్బతింటాయన్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేనేతల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం ఏమి చేయాలి.. మీరు ఆలోచించాలని సూచించిన ఆయన.. కొద్ది మంది సన్నాసులకు ఏమి చెప్పినా అర్థం కావడం లేదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతారు అంటూ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.
వాస్తవానికి మనది బంగారు తునక, దేశంలోనే మన ప్రభుత్వ ఉద్యోగులు జీతం ఎక్కువ తీసుకుంటున్నారని గుర్తుచేశారు సీఎం కేసీఆర్.. కోకాపేట్‌లో భూములు అమ్ముతే రూ.2వేల కోట్లు వచ్చాయని.. ఈ డబ్బులు సంక్షేమం కోసం వాడతామని తెలిపారు.. మనది ధనిక రాష్ట్రం.. పేద రాష్ట్రం కాదు అని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్.. త్వరలో చేనేత పెద్దలను పిలిచి మీటింగ్ పెడతా.. ఏమి చేస్తే బాగుంటుందో చర్చిద్దామన్న ఆయన.. ఈ వయస్సులో నాకు పెద్దగా కాంక్షలు లేవు.. ఏ వర్గాలకు ఏమీ చేయాలో అది చేస్తానన్నారు.. మీరంతా నా వెంట ఉన్నంత కాలం నా లైన్ ఎవరు మార్చలేరు..ఎవరు ఏమి మాట్లాడినా నన్ను ఏమీ చేయలేరన్నారు.. ఇక, వ్యక్తిగతంగా ఎల్.రమణ నాకు మంత్రి మిత్రుడని చెప్పిన కేసీఆర్.. ఆయన రాజకీయ భవిష్యత్ కూడా బాగుంటుందని తెలిపారు..
