కేసీఆర్ పెద్ద మనసు… అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం

ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామన్నారు. ఏడాదికి ధాన్యం ఎంత కొంటారో టార్గెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.

Read Also: మూడో స్థానంలో విజయవాడ… 13వ స్థానంలో హైదరాబాద్

మరోవైపు రైతు సంఘాల పోరాటం వల్లే ప్రధాని మోదీ దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల మీద పెట్టిన కేసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు . ఈ పోరాటంలో వందలాదిమంది ఆత్మార్పణం చేశారని.. ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని.. భారతప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ కోరారు. రైతు ఉద్యమం వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా ముందుకు సాగిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ హితవు పలికారు.

Related Articles

Latest Articles