Site icon NTV Telugu

మళ్లీ ఢిల్లీకి సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. హస్తినలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. అయితే, మరోసారి హస్తినకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు.. ఈ సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనుంది.. అయితే, గతంలో జరిగిన ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరుకాకపోవడంతో.. విమర్శలు కూడా వచ్చాయి. ఇక, ఈ పర్యటనలో.. ఇంకా ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఒకే నెలలో రెండోసారి తెలంగాణ సీఎం.. ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version