Site icon NTV Telugu

KCR: కేంద్రానికి కేసీఆర్‌ డెడ్‌లైన్‌.. 24 గంటల్లో తేల్చకపోతే..!

Cm Kcr

Cm Kcr

వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్‌ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి అహంకారం ఎందుకు? అని నిలదీశారు.. ధాన్యం కోనుగోళ్లపై కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. కేంద్రం వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోతే.. మేమే నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read Also: Rakesh Tikait: తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్రానికి సిగ్గు చేటు..

ఇక, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.. పీయూస్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన.. నూకలు తీనమన్నాడు.. ఆయన పీయూష్ గోయల్‌ కాదు.. పీయూష్ గోల్‌మాల్‌ అని మండిపడ్డారు.. గోయల్‌ ఉల్టా ఫల్టా మాట్లాడుతున్నారు.. పీయూష్ గోయల్‌కు ఏమైనా అవగాహన ఉందా? మాకు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని నిలదీశారు.. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్లపైకి వ‌స్తార‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోడీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరారు.. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం.. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోడీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ, రైతుల వ‌ద్ద మాత్రం పెట్టుకోవద్దు అని హెచ్చరించారు.. మరోవైపు.. హైదరాబాద్‌లో బీజేపీ ఎందుకు ధర్నా చేస్తుంది? అని ప్రశ్నించారు కేసీఆర్.. బీజేపీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందన్న ఆయన.. కేంద్రం ప్రతి గింజా కొంటుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ప్రచారం చేశారు… మరి, తెలంగాణ ధాన్యం కొనడానికి కేంద్రానికి డబ్బుల్లేవా, మనసు లేదా? అని నిలదీశారు.కేంద్రంపై ఫైర్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…

Exit mobile version