NTV Telugu Site icon

బండి సంజయ్‌ పాదయాత్ర మళ్లీ వాయిదా..? ఈసారి కారణం ఇదే..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్‌ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు.. దీంతో.. ఈ నెల 24వ తేదీ వరకు సంతాప దినాలుగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.. 24వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.. ఆ ప్రభావం బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాద యాత్రపై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. దీంతో.. ఈ నెల 24 నుంచి బండి సంజయ్‌ తలపెట్టిన పాదయాత్ర మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. కానీ, ఇంకా పాదయాత్ర వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర నాయకత్వం. కాగా, ఇప్పటికే సంజయ్‌ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రతో వాయిదా వేసుకున్నారు.. ఇప్పుడు మరోసారి కళ్యాణ్‌సింగ్ మృతి కూడా సంజయ్‌ యాత్రకు బ్రేక్‌ వేసే అవకాశం ఉందంటున్నారు.