ఇరవైరోజుల నాటకీయ పరిణామాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా యొడ్యూరప్ప రాజీనామా చేయడం, ఆస్థానంలో బసవరాజ్ బొమ్ముయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. బొమ్మయ్ గతంలో జనతాదళ్ ముఖ్యమంత్రిగా ఆపార్టీ జాతీయ అద్యక్షుడుగా పనిచేసిన ఎస్‌ఆర్‌బొమ్మయ్ కుమారుడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మయ్‌ని తొలగించినప్పుడు కోర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. పాత చరిత్ర అలా వుంచితే బసవరాజ్ యొడ్యూరప్ప మంత్రివర్గంలో హోంశాఖ నిర్వహించారు. ఆయనకు విశ్వాసపాత్రుడు.అంతేగాక యెడ్యూరప్పలాగే లింగాయత్ వర్గానికి చెందిన వారు. ఆయన సలహామేరకే బసవరాజ్ ఎన్నిక జరిగిందనే అభిప్రాయం బలంగా వుంది. అంతకు ముందు వినవచ్చిన ప్రహ్లాద్‌జోషి,మురుగేశ్ నిరానీ, అరవింద బెల్లాడ్ తదితర పేర్లన్నీ వెనక్కు పోయాయి. కేంద్ర మంత్రులుధర్మేంద్ర ప్రధాన్,కిషన్‌రెడ్డిల సమక్షంలో బసవరాజ్ ఎంపిక ప్రకటించారుగతంలోనాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన యెడ్యూరప్పకు బలమైన అనుచరవర్గం మాత్రమే గాక లింగాయత్‌లలో మంచి పట్టు వుందని చెబుతారు.ఆయనను మారుస్తారనే సూచనలు రాగానే లింగాయత్ నాయకులే గాక సాధుసంతులు కూడా వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చూశాం.జులై ఆరున అధిష్టానం అడిగితే తక్షణం రాజీనామా చేస్తానని ప్రకటించిన యెడ్యూరప్ప తర్వాత చాలా తతంగాలే నడిపించారు. డిల్లీ వెళ్లి మంతనాలు జరిపి విఫలమైనారు. చివరకు తమ పార్టీ జాతీయ అద్యక్షుడు జెపినడ్డాతో తన పాలనలోలేపమేమీ లేదని కితాబు ఇప్పించుకుని ఆ మరుసటి రోజునే రాజీనామా చేశారు. 75 ఏళ్లు పైబడినవారికి పదవులు వుండరాదనే సూత్రాన్ని పక్కనపెట్టి తనకు రెండేళ్లు అవకాశమిచ్చారని అధిష్టానానికి కృతజ్ఞతలుచెప్పారు. గతంలో యెడ్యూరప్పను తప్పించినప్పుడు ఆయన బయిటకు వెళ్లి కర్ణాటక ప్రజాపక్ష పేరుతో పార్టీ పెట్టుకున్నారు. స్వంతంగా స్థానాలు గెలవలేకపోయినా బిజెపి అవకాశాలను దెబ్బతీశారు.యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర కూడా రాజకీయాలలో చురుగ్గావున్నారు. ఈ పూర్వరంగంలో ఆ తరగతికే చెందిన బసవరాజ్‌ను ఎంపిక చేయడంలో బిజెపి అధిష్టానం ఉభయతారకంగా వ్యవహరించిందని చెప్పాలి. ఎందుకంటే కర్ణాటకలో 16శాతం లింగాయత్‌లు వున్నారు.2023లో జరిగే ఎన్నికలకు సిద్ధం చేయడంలో కొత్తముఖ్యమంత్రి ఏ మేరకు జయప్రదమవుతారో భవిష్యత్తు చెప్పాలి.
నిజానికి కర్ణాటకలోనే దేశంలో చాలాచోట్ల ప్రధాని మోడీ బృందం బిజెపి నేతలను మార్చే పనిలో పడిరది. ఈ నాలుగుమాసాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది,మేలో ఫలితాలు వెలువడిన రాష్ట్రాలలో బిజెపికి విజయం కలిగిన ఒకేఒక రాష్ట్రం అసోంలోనూ ముఖ్యమంత్రి సర్వానంద సోనేవాల్‌ను మార్చి హేమంత్ విశ్వాస్ శర్మకు పగ్గాలు అప్పగించింది. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన శర్మ కిందటి దఫా బిజెపి విజయానికి ప్రధాన కారకుడనే అభిప్రాయం వుంది. అప్పట్లో తనకు నాయకత్వం ఇవ్వకపోవడంపై వర్మ కినుక వహించినా నాయకత్వానికి సహకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి విస్తరణకు ప్రభుత్వాలలో చోటు సంపాదించడానికి వ్యూహకర్తగా వ్యవహరించారు.అందుకే ఈసారి సోనేవాల్‌ను కేంద్రానికి మార్చి ఆయనను ముఖ్యమంత్రిని చేశారు.
బిజెపికి ముఖ్యమంత్రుల మార్పు కొత్తేమీ కాదు. 1993-98 మధ్య ఢల్లీిలో నాలుగు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.మదన్‌లాల్‌ఖురానా,సాహెబ్‌సింగ్‌వర్మ, సుష్మా స్వరాజ్‌లతో ప్రయోగాలు చేసి షీలాదీక్షిత్‌కు పగ్గాలు అప్పగించింది. అదేతరహాలో ఇటీవల ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మ్చాండం ఒకప్పటి కాంగ్రెస్ రికార్డును కూడా దాటేసింది. ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని గత మార్చిలో త్రినాథసింగ్‌రావత్‌ను మార్చి తీర్థ్‌సింగ్ రావత్‌ను ప్రతిష్టించింది. మళ్లీమూడు నెలలు తిరగకముందే జులైలో ఆయనను మార్చి పుష్కర్‌సింగ్ దమ్మీని ముఖ్యమంత్రిని చేసింది. శాసనసభలో సభ్యుడు గాని తీర్థసింగ్‌రావత్ ి ఆరుమాసాలలోగా ఎన్నికవడాని ఉప ఎన్నికలేకపోవడం ఇందుకు కారణంగా పైకిచెప్పారుకాని వాస్తవంలో తీర్థసింగ్ అస్తవ్యస్త నిర్వాకాలతో వచ్చేఎన్నికలలో గెలుపు సాద్యం కాదని అంచనాకు రావడమే ఇందుకు నిజమైన కారణం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడాఆరునెలల్లో ఎన్నిక కావలసి వుంది.ఆమెకు అవకాశం నిరాకరించడం కోసం కరోనాను కారణంగా చూపి ఎలాటి ఉప ఎన్నికలు వద్దని కేంద్రం ఎన్నికలసంఘానికి సలహా ఇస్తుందని భావిస్తున్నారు. అది తీర్థసింగ్‌పైనా ప్రభావం చూపుతుందని చెప్పి మార్చేశారు.
దేశంలోనే పెద్దరాష్ట్రమే గాక బిజెపి కేంద్ర అధికారానికి ములపీఠంగా వున్న ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వాన్ని మార్చకపోయినా ఆ అంచులవరకూ తీసుకెళ్లింది బిజెపి అధిష్టానం.ఢల్లీికి పిలిపించి తాము కోరుకున్న మార్పులు చేర్పులకు ఒప్పించి పంపించింది.ఆ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఏడుగురు కేంద్రమంత్రులకు విస్తరణలో చోటు కల్పించింది. గతంలోశక్తివంతుడుగా ,దాదాపు మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడుగా చూపబడిన యోగి ఇప్పుడు కేంద్ర నాయకుల గీతలలో సంచరిస్తూ మరోసారి అధికారం కాపాడుకోవడానికి అవస్థ పడాల్సిన పరిస్థితి. వీటన్నిటి వెనక మోడీ ప్రభుత్వంపై అసంతృప్తిపెరుగుతున్నదనే వార్తలు సర్వేలు బిజెపి ఆరెస్సెస్‌శిబిరంలో అభద్రత సృష్టించినందునే ఇవన్నీ జరుగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కాని నాయకుల మార్పుతో ఆ పరిస్థితి మారిపోతుందా అనేది పెద్ద ప్రశ్న.