NTV Telugu Site icon

మరోసారి జగన్‌పై విమర్శలు చేసిన టీడీపీ నేత పట్టాభి

TDP Leader Pattabhi

టీడీపీ నేత పట్టాభిరామ్‌ మరోసారి సీఎం జగన్‌ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు.

ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి ఎకరాలు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. సేకరించిన భూమినే ఇంకా పేదలకు పంచలేదని, కొత్తగా గెజిట్‌ నోటిషికేషన్‌ ఇవ్వాల్సిన అవసరమేంటని ఆయన అన్నారు. ఈ ముసుగులో ఏటా రూ.2500 కోట్లు కొట్టేయడానికే జగన్‌ అండ్‌ కో సిద్దమయ్యారు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.