సీఎం జగన్‌కి నారా లోకేష్ లేఖ: చెరకు రైతుల్ని పట్టించుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణే. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. విజయనగరంలోని ఎన్‌సిఎస్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు వేల మంది చెరకు రైతులకు రెండు సీజన్ల బకాయి బిల్లులు రూ.17 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చక్కెర కర్మాగారం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అసమర్ధ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ గళమెత్తిన రైతుల పై ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా?
Also Read
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
ఇప్పుడు రైతులను మరింత మానసిక క్షోభకి గురిచేస్తూ బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 80 మంది రైతులకు నోటీసులు అందజేశారు. కష్టపడి పండించిన చెరకును చక్కెర పరిశ్రమకు తరలిస్తే రైతులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా బిల్లుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయం.
తీవ్ర సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడం మాని ప్రభుత్వమే వారిపై వేధింపులకు దిగడం ప్రభుత్వ అహంకార ధోరణికి పరాకాష్ట. రైతులకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి.రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసి బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నా అన్నారు లేఖలో నారా లోకేష్.
తాజావార్తలు
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!