Site icon NTV Telugu

ఏపీలో నిరసన జ్వాలలు..

ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్‌ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది.

దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు. రోడ్లపైన బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం బస్టాండ్‌ కూడలిలో టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.

Exit mobile version