NTV Telugu Site icon

తీవ్ర రూపం దాల్చిన తౌక్టే…అప్ర‌మ‌త్త‌మైన తీర రాష్ట్రాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు గాలులు వీస్తున్నాయి.  కేరళలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.  భారీ వర్షాల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  ఈనెల 18 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది.  దీంతో గుజరాత్ లోని 15 జిల్లాలను అప్రమత్తం చేశారు.  అత్యవసరస సహాయక బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.  దీనిప్రభావం అటు మహారాష్ట్ర, గోవాలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది.