తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రి వర్గంలో ఉన్న వారు ఎవరైనా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారా.. బంగారు తెలంగాణ కోసమే బండి సంజయ్ దీక్ష అని ఆయన అన్నారు. కేసీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్న చూడు మీరు అరెస్ట్ చేసిన ఎంత మంది కార్యకర్తలు బీజేపీ కార్యాలయం కి చేరుకున్నారో అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
