T20 world cup : నేటి నుంచే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనాధన్ క్రికెట్లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది.
ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట నేటి నుంచి జరుగుతాయి. ఇందులో ఆరేసి జట్లతో రెండు గ్రూపులుండగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా నిలిచిన జట్లు ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో అర్హత మ్యాచ్‌లు జరిగాయి. వీటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో చేరాయి. ఇక అసలు సమరంలో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఇందులో విజేతలు టైటిల్ కోసం నవంబరు 14న దుబాయ్‌లో బరిలోకి దిగుతాయి. బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు. భారత్‌తో పాటు వెస్టిండీస్, పాక్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌కు కూడా కప్‌ను గెలుచుకునే సత్తా ఉంది.
- Tags
- cricket
- dubai
- india
- T20 World Cup
తాజావార్తలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్‌కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..