శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం – సీపీఐ, డోలా సేన్ & శాంత ఛత్రీ – టీఎంసీ, ప్రియాంక చతుర్వేది & అనిల్ దేశాయ్ – శివసేన లతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఫూలో దేవి నేతమ్, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ లను సస్పెండ్ చేస్తూ.. సభను రేపటి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. అయితే గత వర్షాకాల సమావేశాల్లో కూడా రాజ్యసభ చైర్మన్‌ను కించపరిచారని పలువురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
