లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత వరకు యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.. సీబీఐతో విచారణ జరిపించేందుకు అంత సుముఖతను వ్యక్తం చేయలేదు ధర్మాసంనం.. సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదనేందుకు గల కారణాలు ఏమిటో మీకు బాగా తెలుసంటూ సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీజేఐ ఎన్వీ రమణ. లఖింపుర్ ఘటన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే సరైన రీతిలో చర్యలు తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, లఖింపుర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాయడంతో.. గురువారం రోజు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. లఖింపుర్ ఘటనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కారు ఇవాళ ఆ నివేదికను సమర్పించింది. కానీ, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఇక, దసరా తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!