టీమిండియా పరాజయాలకు కారణం అది కాదంటున్న గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లకుండానే నిష్క్రమించనుంది. సోమవారం నామమాత్రంగా జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ పరాజయాలకు టాస్ కారణమన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. భారత్ ఓటములకు టాస్ ఎంత మాత్రం కారణం కాదన్నారు. మన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారని సన్నీ తెలిపాడు. వారు తెలివిగా బంతులు వేయడం వల్ల మనవాళ్లు పరుగులు చేయలేకపోయారని వివరించాడు.
Read Also: మరో వివాదంలో ఇరుకున్న ఫేస్బుక్
Also Read
ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మనవాళ్లు గొప్పగా పుంజుకుని భారీ స్కోరు చేశారని.. అదే తరహాలో తొలి రెండు మ్యాచ్‌లలో ఆడి ఉంటే భారత్ సెమీస్‌కు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ చేరకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇవాళ్టి మ్యాచ్… కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, కోచ్‌గా రవిశాస్త్రికి ఆఖరిది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..