చెప్పినట్టే టీడీపీకి గోరంట్ల రాజీనామా చేస్తారా…?
ఆ టీడీపీ సీనియర్ నేత ఆంతర్యం ఏంటో పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. రాజీనామా చేస్తానన్న తేదీ దగ్గర పడి ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం దూతలు వచ్చారు.. వెళ్లారు. వారేం మాట్లాడారో.. హైకమాండ్ బుజ్జగించిందో లేదో తెలియదు. దీంతో ఆయన ఉంటారా.. వెళ్తారా అని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఆయనెవరో.. ఆ బుజ్జగింపులేంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల కాల్ లిఫ్ట్ చేయడం లేదా?
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకు 25ను డెడ్‌లైన్‌గా పెట్టారు. అసలు ఆయన వ్యూహం ఏంటో అంతుబట్టడం లేదు. ఇప్పుడు పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే సద్దుమణుగుతాయా లేదా అన్నది డౌటే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజమండ్రి వస్తున్నారని చెప్పుకోవడం మినహా ఆ జాడలే లేవు. టీడీపీ అధినేత చంద్రబాబును తాను కలిసేది లేదని మీడియా ముందు కుండబద్దలు కొట్టేశారు గోరంట్ల. ఆయన అనుచరులు మాత్రం.. చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబును కలిసేదే లేదని తెగేసి చెప్పిన గోరంట్ల ఫోన్లో ఎలా మాట్లాడతారన్నది ప్రశ్న. చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల కాల్ లిఫ్ట్ చేయడం లేదనేది సమాచారం.
ఆదిరెడ్డి అప్పారావు ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా?
చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని పదే పదే చెప్పుకొనే గోరంట్ల ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడాయనకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పక్కలో బల్లెంలా మారారు. గోరంట్లను మించి వేగంగా ఎదిగిపోయారు. రాజకీయంగా ప్రాధాన్యం సంపాదించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ఉన్న బంధుత్వాన్ని అడ్డంపెట్టుకుని అధిష్ఠానంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు అప్పారావు. రాజమండ్రి రాజకీయాల్లో పైచెయ్యి సాధించారు కూడా. ఈ విషయాన్నే బుచ్చయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన రాజీనామా అస్త్రం ప్రయోగించారు. రాజీనామాపై గోరంట్ల ఇలా లీకులు ఇచ్చారో లేదో అలా టీడీపీ నేతలు ఆయన ఇంటి దగ్గర వాలిపోయారు.
బుచ్చయ్య డిమాండ్లను చంద్రబాబు నెరవేరుస్తారా?
టీడీపీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులు.. సమస్యలను.. డిమాండ్లను చంద్రబాబు దూతల దగ్గర పెట్టారు గోరంట్ల. రెండు దఫాలుగా రాయబారానికి వచ్చిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప.. కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు అన్నీ చంద్రబాబు తీరుస్తారని హామీ ఇచ్చారు. అయితే డిమాండ్లు నెరవేరే వరకు బుచ్చయ్యచౌదరిలో అసంతృప్తి అలాగే ఉంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే స్థానికంగా ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు తీర్చగలరా? డిమాండ్లను నెరవేరుస్తారా? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. పైగా టీడీపీలో పలుకుబడి మసకబారుతూ ఉండటంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు బుచ్చయ్య.
టీడీపీ పెద్దలపై గోరంట్ల అసంతృప్తి తగ్గిందా.. లేదా?
గోరంట్ల డిమాండ్లకు హైకమాండ్ తలొగ్గితే ఆదిరెడ్డి కుటుంబం కినుక వహిస్తుందా.. సర్దుకుంటుందా అనేది చర్చగా మారింది. ఆదిరెడ్డి చెప్పినదానికే అధిష్ఠానం సై అంటే గోరంట్ల తనదారి తాను చూసుకోక తప్పదు. ఇలాంటి తరుణంలో మధ్యే మార్గం వెతికే పనిని సంక్షోభ నివారణ టీమ్‌కు అప్పగించారు చంద్రబాబు. ఆ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబు అడుగులు ఉండొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం గోరంట్లకు పార్టీపై అసంతృప్తి తగ్గిందీ లేనిదీ తెలియదు. రాజీనామా లీకులిచ్చిన నాలుగు రోజుల క్రితం జరిగిన హడావిడి ఇప్పుడు లేదు. ఏదేమైనా బుచ్చయ్య పెట్టిన డైడ్‌లైన్‌లోగా చంద్రబాబు నుంచి సానుకూల స్పందనొస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. చంద్రబాబు స్పందించని పక్షంలో బుచ్చయ్య చౌదరి ఎలా స్పందిస్తారన్నది పరిశీలకులకు అంతుబట్టడం లేదు. టీడీపీ నుంచి స్పందన రాకపోతే ముందు చెప్పినట్టే రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. ఏమౌతుందో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!