అందుబాటులో లేని ఎమ్మెల్యే.. అడ్డూ అదుపూ లేని ఛోటా నేతల అక్రమాలు
మా ఎమ్మెల్యే కనపడుట లేదు… ఇది ఆ నియోజకవర్గ ప్రజల మాట. మొదటి సారి బంపర్ మెజారిటీతో గెలిచిన ఆయన, నియోజకవర్గంలో మరీ నల్లపూసై పోయారట. అనుచరుల్ని వాకబు చేస్తే సారు చాలా బిజీ అంటున్నారట.. ఎవరికీ దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి?
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ …. యువ ఎమ్మెల్యే ..పలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. తొలిసారి టికెట్ దక్కించుకుని, గత ఎన్నికలో దాదాపు నలభైవేలకు పైగా మెజారిటీతో మాజీ మంత్రి అమరనాధరెడ్డిపై గెలిచారు. 2014లో వైసీపీ నుండి అమర్నాథ్ రెడ్డి గెలిచినా… తరువాత కాలంలో తిరిగి సొంత గూడైన టిడిపిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న పార్టీలో విభేదాలు, అభివృద్ధి పెద్దగా జరగపోవడంతో గత ఎన్నికలలో ఆయనకు సీన్ రివర్స్ అయ్యింది. ఇదే సమయంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి అయినా, అత్యంత భారీ మెజారిటీతో వెంకటయ్య గౌడ్ ని గెలిపించారు నియోజకవర్గప్రజలు.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
కానీ, ఎమ్మెల్యేకి రాజకీయ అనుభవం లేకపోవడంతో దీనినే అలుసుగా తీసుకుని పలమనేరులో ఛోటా మోటా నాయకులు రెచ్చిపోతున్నారని టాక్ ఓ రేంజ్ లో వినపడుతుంది. అది కాస్తా గత పంచాయతీ ఎన్నికల సమయంలో పీక్స్ కు చేరిందని స్ధానికులు చెబుతున్నారు …
ఎమ్మెల్యే నియోజక వర్గంలో కంటే సొంత వ్యాపారాల కోసం బెంగుళూరులో ఉంటున్నారట. దీంతో పార్టీలో ఎవరికి నచ్చివారు వ్యవహరిస్తున్నరనే మాటలు కేడర్ లో వినపడుతున్నాయి. మంత్రి అనుచరులు ఓ వర్గం గా.. ఎమ్మెల్యే అనుచరులు మరో వర్గంగా.. గతంలో టికెట్ ఆశించి భంగపడినా నేతలు మరో వర్గం ఉంటున్నారట. దీంతో కేడర్ సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారట…. ఏదైనా పనికోసం అయినా, సమస్యలు పరిష్కారానికి ఈ మూడు వర్గాల్లో ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారటా లోకల్ వైకాపా కేడర్.
ఇక ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ఛోటా నేతలు… బెదిరింపులు… భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారనే టాక్ స్ధానికుల్లొ వినపడుతోంది… ఇవన్నీ ఎమ్మెల్యేకి చెబుదామన్న ఆయన అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు స్ధానికులు…
వారి అనుచరులను అడిగితే సార్ వెరి బిజీ అంటున్నారట… కరోనా సమయంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని సమాచారం … మంత్రి పెద్దిరెడ్డి నియోజక వర్గానికి వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యే హడవిడి చేయడం తప్ప … సాధారణ సమయాల్లో ఆయన పెద్దగా కనపడటం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి… మాజీ మంత్రి అమరనాధరెడ్డిని పక్కన పెట్టి అవకాశం ఇస్తే.. ఆయన సొంత పనుల్లో ఆయన బిజీ ఉంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారని టాక్ జోరుగా నియోజకవర్గంలో సాగుతోంది …
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!