అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క ఓటమితో కుదేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఒక్క ఓటమితో సోదిలో లేకుండా పోయారు. అన్నీ వరస ఎదురుదెబ్బలే. పార్టీని కాదని వేస్తున్న పొలిటికల్ స్టెప్పులు తడబడుతున్నాయి. ఇప్పుడు సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ మాజీ మంత్రి దారెటు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
ఐదుసార్లు గెలిచిన చోట సీటుకు ఎసరొచ్చిందా?
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో.. టీఆర్‌ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు.. ప్రస్తుతం చర్చల్లో కూడా లేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కనుసైగతో రాజకీయాలను శాసించిన నాయకుడిని సొంతపార్టీలోని ప్రత్యర్థులే ఆడేసుకుంటున్నారట. కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోటే సీటుకు ఎసరొచ్చిన పరిస్థితి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కి గులాబీ కండువా కప్పేసుకున్నారు హర్షవర్దన్‌రెడ్డి. అక్కడ నుంచి జూపల్లికి కష్టాలు రెట్టింపయ్యాయని చెబుతారు గులాబీ నేతలు.
ఉనికి కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారా?
ఒకప్పుడు కొల్లాపూర్‌లో ఎదురే లేని జుపల్లికి ఇప్పుడు అడుగడుగునా ఆటంకాలే ఆటంకాలు. ఉనికి కాపాడుకోవడానికే ఆయనకు టైమ్ సరిపోవడం లేదట. ఏ మాత్రం అవకాశం చిక్కినా ప్రత్యర్థులు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుండటంతో జూపల్లి వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రస్తుతం కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గపోరు ప్రభావం స్పష్టంగా కనిపించింది. తన వర్గానికి చెందిన వారికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నా.. ఆయనకు ఎక్కడో తేడా కొడుతోందని చెబుతున్నారు.
ఎదురు చూసినా నామినేటెడ్ పోస్ట్ దక్కలేదు!
ఈ మూడేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ సర్కార్ అనేక నామినేటెడ్ పోస్ట్‌లు ప్రకటించినా.. వాటిల్లో ఎక్కడా జూపల్లి కృష్ణారావు పేరు లేదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. ఊరట నిచ్చే కబురు ఒక్కటీ లేదని వాపోతోంది ఆయన వర్గం. తిరిగి అసెంబ్లీకిలోకి అడుగుపెడితే కానీ.. జూపల్లికి.. ఆయన నమ్ముకున్నోళ్లకు రాజకీయ భవిష్యత్ ఉండదని అనుకుంటున్నారట. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే ఆ మేరకు వర్కవుట్ చేస్తున్నారట మాజీ మంత్రి.
సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తే .. జూపల్లి ఏం చేస్తారు?
జూపల్లితో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ వర్గాలు టచ్‌లోకి వెళ్లాయట. దీంతో ఆయన పార్టీ మారతాయా అన్న చర్చ జరుగుతోంది. కానీ.. జూపల్లి వాటిని ఖండిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంటామని.. వచ్చే ఎన్నికల్లో జూపల్లికి టికెట్ వస్తుందని ఆయన అనుచరులు దీమాగా చెబుతున్నారట. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తామని చెబితే.. మాజీ మంత్రి ఏం చేస్తారు? పార్టీ మారతారా లేదా? మున్సిపల్ ఎన్నికల్లో అనుచరులకు ఉపయోగపడ్డ సింహం గుర్తును అడ్డంపెట్టుకుని బరిలో దిగుతారా? అన్న చర్చ క్రమంగా జనాల్లోకి వెళ్లేలా చేస్తున్నారట. మరి.. జూపల్లి రాజకీయ భవిష్యత్ ఏంటో.. ఏం చేస్తారో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..