Smuggled Gold: ముంబై విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం విలువ ఎంతంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10.16 కోట్ల రూపాయల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో 18 మంది సూడాన్ మహిళలతో పాటు ఒక భారతీయ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సోదాల్లో సుమారు రూ.85 లక్షల విలువైన 1.42 కిలోల బంగారంతో పాటు రూ. 16 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ. 88 లక్షల భారతీయ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Also Read:Vikram : కమల్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?
సోమవారం యూఏఈ నుంచి ముంబైకి వెళ్లే ప్రయాణికుల సిండికేట్ ద్వారా పేస్ట్ రూపంలో బంగారాన్ని భారత్‌లోకి స్మగ్లింగ్ చేయబోతున్నారనే నిర్దిష్ట నిఘా ఆధారంగా డీఆర్ఐ అధికారులు సిటీ ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టారు. మూడు విమానాల్లో ప్రయాణిస్తున్న సిండికేట్‌లో భాగమని అనుమానిస్తున్న ప్రయాణికులను విమానాశ్రయంలో డిఆర్ఐ బృందం గుర్తించి అడ్డగించింది. డీఆర్ఐ తమ సోదాల్లో 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో, బంగారు ముక్కలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ. 10.16 కోట్లు అని అధికారి తెలిపారు. స్మగ్లింగ్ బంగారాన్ని తీసుకెళ్తున్న సూడాన్‌కు చెందిన 18 మంది మహిళలు, ప్రయాణికుల కదలికలను సమన్వయం చేస్తున్న భారతీయ మహిళను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కువ భాగం అనుమానాస్పద ప్రయాణీకుల శరీరంపై దాచబడిందన్నారు. విలువైన లోహాన్ని గుర్తించడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం నిందితుల విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
Also Read:Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!