ప్రముఖ సింగర్ మధు ప్రియ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-1 కంటెస్టెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. “ఆడపిల్లనమ్మా” అనే సాంగ్ తో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మధుప్రియ. ఆ తరువాత పలు సాంగ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్న మధుప్రియ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ఈ ఫిర్యాదు చేశారు. అయితే షీ టీమ్స్ మెయిల్ ను సైబర్ కు బదిలీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో మధు ప్రియ పేర్కొన్నారు. తనకు వచ్చిన బ్లాంక్ ఫోన్ కాల్స్ వివరాలను సైబర్ క్రైమ్ కు అందజేసింది. మధు ప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354b సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారని సమాచారం.