NTV Telugu Site icon

ప్లీనరీ వేళ టీఆర్‌ఎస్‌కి షాక్‌ ఇచ్చిన షబ్బీర్‌ అలీ..

ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ షాక్‌ ఇచ్చారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక తరువాత 15మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్‌ పతనం మొదలైందని, చాలా మంది నేతలు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారన్నారు.

తెలంగాణాలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కు తగిన బుద్ది చెబుతారన్నారు. గాంధీ భవన్‌లోకి గాడ్సే దూరడం కాదు.. ప్రగతి భవన్‌లోనే కొత్త గాడ్సే విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలువదని తెలిసి.. మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.