NTV Telugu Site icon

Ranga Reddy: స్కూటీ, ఆర్టీసీ బస్సు ఢీ.. తల్లీ కొడుకు మృతి

Road Accident

Road Accident

రోడ్డు ప్రమాదాలతో రోడ్డు నెత్తురోడుతున్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా మలుపుల దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు కారణం అంటున్నారు నిపుణులు. వాహనం స్పీడ్ ఎక్కువైతే, ఏదైనా అడ్డం వచ్చి బ్రేక్ వేస్తే…పరిస్థితి ఉల్టాపల్టా అవుతుంది. స్పీడ్ కారణంగా సదరు వాహనం బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో సహజంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Read Also: Mandipalli Ramprasad Reddy: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం…

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. రంగాపురం గ్రామ మూలమలుపు వద్ద స్కూటీ పై ప్రయాణిస్తున్న హజరత్ బేగం వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి వేగంగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..

Show comments